లేటెస్ట్ : గొప్ప మనసు చాటుకున్న సూపర్ స్టార్ మహేష్ & సూపర్ ఫ్యాన్స్

Published on Aug 13, 2022 7:00 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఇలియానా హీరోయిన్ గా 2006లో తెరకెక్కిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ మూవీ పోకిరి. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందించగా మంజుల ఘట్టమనేని ఇందిరా ప్రొడక్షన్స్ వారితో కలిసి తన వైష్ణో అకాడెమి బ్యానర్ పై ఎంతో గ్రాండ్ గా పోకిరి ని నిర్మించారు పూరి జగన్నాథ్.

ఇక ఈ మూవీ అత్యద్భుత విజయం తరువాత హీరో మహేష్, డైరెక్టర్ పూరి, హీరోయిన్ ఇలియానా సహా ప్రతి ఒక్కరికీ కూడా విపరీతంగా క్రేజ్ తెచ్చిపెట్టడంతో పాటు బయ్యర్స్, డిస్ట్రిబ్యూటర్స్ కి కాసుల పంట పండించింది. అయితే ఈ ప్రతిష్టాత్మక మూవీని మొన్నటి మహేష్ బాబు జన్మదినం సందర్భంగా 16 ఏళ్ళ తరువాత 4కె వర్షన్ లోకి కన్వర్ట్ చేసి రిలీజ్ చేసారు. ఆడియన్స్, సూపర్ ఫ్యాన్స్ యొక్క భారీ స్థాయి క్రేజ్ తో పోకిరి వరల్డ్ వైడ్ గా 376 కి పైగా స్పెషల్ షోలు ప్రదర్శితమై ఏకంగా రూ. 1.73 కోట్ల కలెక్షన్ సొంతం చేసుకుంది.

కాగా ఈ డబ్బు నుండి రూ. 10 లక్షల రూపాయలు తెలుగు చలన చిత్ర దర్శకుల ట్రస్ట్ కి అలానే మిగతా రూ. 1. 63 కోట్లు మహేష్ బాబు ఫౌండేషన్ వారికి చిన్న పిల్లల గుండె ఆపరేషన్స్, చదువుల నిమిత్తం డొనేట్ చేయడం జరిగింది. ఇక ఇంతటి మంచి బృహత్కార్యం చేపట్టి గొప్ప మనసు చాటుకున్న సూపర్ స్టార్ మహేష్ పై, అలానే ఆయన ఫ్యాన్స్ పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.

సంబంధిత సమాచారం :