మహేష్ – త్రివిక్రమ్ సినిమా పరిస్థితి ఏమిటి ?

Published on Jun 28, 2022 3:00 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కలయికలో రాబోతున్న క్రేజీ సినిమా డిటైల్స్ కోసం మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ, ఈ సినిమా పై ఇంకా ఎలాంటి అప్ డేట్ లేదు. కానీ, రోజుకొక రూమర్ మాత్రం వినిపిస్తోంది. ఈ సినిమాలో మహేష్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని, ఇది పీరియాడిక్ డ్రామా అని, ఫ్లాష్ బ్యాక్, లైవ్ సమానంగా సాగుతాయని ఇలా చాలా రూమర్లు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఈ సినిమా పరిస్థితి ఏమిటి, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ? ఎప్పుడు రిలీజ్ అవుతుంది ? అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఏది ఏమైనా పదకొండు సంవత్సరాల తరువాత మహేష్ – త్రివిక్రమ్ కలయికలో సినిమా వస్తుండే సరికి, ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాని వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అన్నట్టు ఎన్టీఆర్ తో ‘అరవింద సమేత, అల్లు అర్జున్ తో ‘అల వైకుంఠపురములో’ వంటి వరుస హిట్ చిత్రాలను అందించాడు దర్శకుడు త్రివిక్రమ్. అందుకే ఈ సినిమాకి రెట్టింపు ఎక్స్ పెటేషన్స్ ఉన్నాయి. కాగా హారికా హాసిని క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించబోతుంది.

సంబంధిత సమాచారం :