మహేష్, త్రివిక్రమ్ సినిమా పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్ !

మహేష్, త్రివిక్రమ్ సినిమా పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్ !

Published on Mar 14, 2022 12:01 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కలయికలో రాబోతున్న క్రేజీ సినిమాలో మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది. ఇది పీరియాడిక్ డ్రామా అని, ఫ్లాష్ బ్యాక్, లైవ్ సమానంగా సాగుతాయని తెలుస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ ను ఏప్రిల్ సెకండ్ వీక్ నుంచి మొదలు పెట్టాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మొదట ఓ ఫైట్ తో షూట్ స్టార్ట్ చేస్తారట. ఈ ఫైట్ ను రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ కంపోజ్ చేస్తున్నారట.

ఇక పదకొండు సంవత్సరాల తరువాత మహేష్ – త్రివిక్రమ్ కలయికలో సినిమా వస్తుండే సరికి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాని వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అన్నట్టు ఎన్టీఆర్ తో ‘అరవింద సమేత, అల్లు అర్జున్ తో ‘అల వైకుంఠపురములో’ వంటి వరుస హిట్ చిత్రాలను అందించాడు దర్శకుడు త్రివిక్రమ్. అందుకే ఈ సినిమాకి రెట్టింపు ఎక్స్ పెటేషన్స్ ఉన్నాయి. కాగా హారికా హాసిని క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించిబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు