డైరెక్ట్ హిందీ సినిమా పై సూపర్ స్టార్ మహేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Published on Apr 7, 2022 3:00 pm IST

టాలీవుడ్ హ్యండ్సం హీరో, సూపర్ స్టార్ మహేష్ బాబు తన తాజా చిత్రం సర్కారు వారి పాట చివరి షెడ్యూల్‌లో బిజీగా ఉన్నారు. నిన్న, అతను కొంత సమయం తీసుకొని హైదరాబాద్‌లో జరిగిన APP ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ కార్యక్రమం లో ఒక జర్నలిస్టు మహేష్ డైరెక్ట్ హిందీ సినిమా ఎప్పుడు చేస్తారని అడిగాడు.

తెలుగు సినిమాలను దేశ వ్యాప్తంగా చూస్తున్న ఈ స్టార్ హీరో కాస్త ఆలోచించి డైరెక్ట్ హిందీ సినిమా చేయాల్సిన అవసరం లేదు అంటూ చెప్పుకొచ్చారు. తాను తెలుగులో సినిమాలు చేయడానికి కమిట్ అయ్యానని, రాజమౌళితో తన సినిమా పాన్ ఇండియాలో విడుదల అవుతుందని మహేష్ చెప్పారు.

డైరక్టర్ పరశురామ్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట మే 12, 2022 న భారీ విడుదల కి సిద్దం అవుతోంది. ఈ చిత్రం లో కీర్తి సురేష్ తొలిసారి మహేష్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :