హీరో సినిమా చూసాను…నాకు విపరీతం గా నచ్చింది – సూపర్ స్టార్ మహేష్

Published on Jan 14, 2022 3:00 pm IST


సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా పరిచయం అవుతున్నాడు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన హీరో చిత్రం జనవరి 15, 2022న గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లు ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

తాజాగా ఈ చిత్రం పై సూపర్ స్టార్ మహేష్ బాబు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. హీరో సినిమా చూసా అని, తనకు విపరీతం గా నచ్చింది అని అన్నారు.టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ తెలిపారు. ముఖ్యం గా అశోక్ కి ఆల్ ది బెస్ట్ అంటూ చెప్పుకొచ్చారు. అశోక్ గత ఐదారేళ్లు గా కష్టపడుతున్న విషయాన్ని వెల్లడించారు. అంతేకాక హర్డ్ వర్క్ చేస్తే సక్సెస్ కచ్చితంగా వస్తుంది అని, అంతేకాక సినిమా కోసం పని చేసిన అందరికీ ఆల్ ది బెస్ట్ తెలిపారు. సంక్రాంతి పండుగ కృష్ణ గారికి బాగా కలిసి వచ్చిన పండుగ అని, ఆయన చిత్రం సంక్రాతికి వచ్చిన ప్రతిదీ బ్లాక్ బస్టర్ అని, అదే సెంటిమెంట్ తన సినిమాలకు కూడా కొనసాగింది అని అన్నారు. ఒక్కడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సరిలేరు నీకెవ్వరు అంటూ చెప్పుకొచ్చారు. ఈ సంక్రాంతి కు తమ కుటుంబం నుండి ఒక హీరో ఇంట్రడ్యూస్ అవుతున్నాడు అని, నాన్న గారి అభిమానులు, నా అభిమానులు అశోక్ ను సపోర్ట్ చేస్తారు అని, హీరో సినిమా పెద్ద హిట్ అవ్వాలి అంటూ చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం :