తెలుగు సినిమాలో చాలా అరుదు… లవ్ స్టోరీ పై సూపర్ స్టార్ మహేష్ కీలక వ్యాఖ్యలు

Published on Sep 21, 2021 1:45 pm IST


అక్కినేని నాగ చైతన్య హీరోగా, సాయి పల్లవి హీరోయిన్ గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం లవ్ స్టోరీ. ఈ సినిమా విడుదల కి సిద్దం అవుతోంది. శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుక కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. మెగాస్టార్ చిరంజీవి మరియు బాలివుడ్ స్టార్ అమీర్ ఖాన్ లు ముఖ్య అతిధులుగా హాజరు అయి, సినిమా పై ప్రశంశల వర్షం కురిపించారు.

అయితే తాజాగా ఈ చిత్రం పై సూపర్ స్టార్ మహేష్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. డాన్స్ పై కేంద్రీకృతం అయిన సినిమా అంటూ లవ్ స్టోరీ గురించి చెప్పుకొచ్చారు. తెలుగు సినిమాలో ఇలా ఉండటం చాలా అరుదు అని అన్నారు. థియేటర్ల లో ఈ సినిమాను చూసేందుకు ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. లవ్ స్టోరీ చిత్ర యూనిట్ కి ఆల్ ది బెస్ట్ అంటూ చెప్పుకొచ్చారు. ఈ చిత్రం ఈ నెల 24 వ తేదీన విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం పవన్ సి హెచ్ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :