సర్కారు వారి పాట సినిమా ప్రోగ్రెస్ పై మహేష్ కీలక వ్యాఖ్యలు!

Published on Sep 24, 2021 11:00 pm IST


సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట చిత్రం లో హీరోగా నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం లో కీర్తి సురేష్ మహేష్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన షూటింగ్ మరియు ప్రోగ్రెస్ పై మహేష్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. దాదాపు సర్కారు వారి పాట చిత్రం షూటింగ్ 60-70 శాతం వరకు పూర్తి అయింది అని వ్యాఖ్యానించారు. అంతేకాక ఈ చిత్రం లో సరికొత్త మహేష్ ను చూస్తారు అంటూ చెప్పుకొచ్చారు.

అంతేకాక మహేష్ బాబు వెబ్ సిరీస్ ల పై సైతం తన అభిప్రాయం ను వ్యక్తం చేశారు. వెబ్ సిరీస్ లో నటించడం పై ఇప్పటి వరకు ఆలోచన చేయలేదు అని, కేవలం వెబ్ సిరీస్ లు చూడటం మాత్రమే చేస్తానంటూ తెలిపారు. అయితే భవిష్యత్ లో వెబ్ సిరీస్ లలో నటించడం పై మాత్రం ఎవరికి తెలుసు అంటూ చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం :