తన సినిమాల స్క్రిప్ట్ విషయం లో మహేష్ కీలక వ్యాఖ్యలు!

Published on Oct 4, 2021 9:20 pm IST


సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకు పోతున్నారు. మహేష్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం సర్కారు వారి పాట. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తాజాగా మీడియా తో ఇంటరాక్ట్ అయిన మహేష్ బాబు పలు కీలక విషయాలను వెల్లడించడం జరిగింది.

తన సినిమాలకు సంబంధించిన స్క్రిప్ట్ విషయాల గురించి మహేష్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తన సినిమాలకు స్క్రిప్ట్ లని తానే ఎంచుకుంటున్నట్లు తెలిపారు. అంతేకాక నమ్రత తో సినిమాల గురించి చర్చించను అని మహేష్ అన్నారు. ఒకవేళ స్క్రిప్ట్ విషయాల్లో విఫలమైతే నేర్చుకుంటా అని అన్నారు. మహేష్ బాబు ఈ చిత్రం పూర్తి అయిన తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక సినిమా చేయనున్నారు. అదే విధంగా రాజమౌళి దర్శకత్వంలో కూడా ఒక సినిమా రానున్న సంగతి అందరికీ తెలిసిందే.

సంబంధిత సమాచారం :