ఆ విషయం లో క్లారిటీ ఇచ్చిన సూపర్ స్టార్..!

Published on May 24, 2022 1:06 am IST


సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరు. ఈ హీరో నటించిన లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. అయితే మహేష్ బాబు తొలిసారిగా సర్కారు వారి పాట చిత్రంలో తన మెడపై రూపాయి పచ్చబొట్టు వేయించుకోవడం చర్చనీయాంశంగా మారింది. నిజ జీవితంలో టాటూ వేయించుకుంటారా అని ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు, తాను ఎప్పుడూ టాటూ వేసుకోనని, వాటిని వేసుకొనే వారిని ఇష్టపడనని మహేష్ చెప్పాడు.

యూరప్‌లో విహారయాత్రకు వెళ్లిన మహేష్, జూలై నెల నుండి త్రివిక్రమ్ దర్శకత్వంలో తన కొత్త సినిమా షూటింగ్‌ను ప్రారంభించనున్నాడు. వార్తల ప్రకారం అతను డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నాడు.

సంబంధిత సమాచారం :