బాలకృష్ణ కి కంగ్రాట్స్ తెలిపిన సూపర్ స్టార్ మహేష్!

Published on Dec 2, 2021 4:01 pm IST

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ చిత్రం ఎట్టకేలకు థియేటర్ల లో నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం విడుదల కి ముందు నుండే భారీ అంచనాలు నెలకొన్నాయి. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటం తో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

అయితే ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి సర్వత్రా పాజిటివ్ టాక్ తో దూసుకు పోతుంది. ఈ మేరకు సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం సోషల్ మీడియా వేదిక గా పలు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అఖండ చిత్రం కి మాసివ్ రెస్పాన్స్ రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. నందమూరి బాలకృష్ణ గారికి, బోయపాటి శ్రీను గారికి, చిత్ర యూనిట్ కి కంగ్రాట్స్ అంటూ చెప్పుకొచ్చారు.

బాలకృష్ణ ఈ సినిమా లో డిఫెరెంట్ లుక్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఈ చిత్రం లో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించడం జరిగింది. శ్రీకాంత్ మరియు జగపతి బాబు లు కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం :