సాలిడ్ యాక్షన్ నే కంటిన్యూ చేయనున్న సూపర్ స్టార్.!

సాలిడ్ యాక్షన్ నే కంటిన్యూ చేయనున్న సూపర్ స్టార్.!

Published on Sep 17, 2022 9:02 AM IST

ప్రస్తుతం మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ భారీ యాక్షన్ డ్రామా కోసం అందరికీ తెలిసిందే. తన కెరీర్ లో సూపర్ క్లాసిక్ సినిమాలు అందించిన దర్శకుడు త్రివిక్రమ్ తో మహేష్ చేస్తున్న హ్యాట్రిక్ సినిమా ఇది కావడంతో ఈ సినిమా పై భారీ స్థాయి అంచనాలు నెలకొన్నాయి. ఇంకా పాన్ ఇండియా లెవెల్ రిలీజ్ ని అయితే మేకర్స్ ప్లాన్ చెయ్యలేదు..

కానీ సినిమా స్కేల్ మాత్రం ఆ లెవెల్లోనే ఉంటుందని ఖచ్చితంగా చెబుతున్నారు. ఇక రీసెంట్ గానే భారీ యాక్షన్ సీక్వెన్స్ తో షూటింగ్ ని స్టార్ట్ చెయ్యగా ఈరోజు రామోజీ ఫిలిం సిటీలో కొత్త షూట్ ని స్టార్ట్ చేసుకోనుంది. అయితే మొన్న స్టార్ట్ అయ్యిన షూట్ కి కంటిన్యూ గా మహేష్ అయితే మళ్ళీ యాక్షన్ తోనే మొదలు పెట్టనున్నారట. దీనితో అయితే ప్రస్తుతానికి మళ్ళీ మహేష్ యాక్షన్ ఎపిసోడ్ లోనే కంటిన్యూ అవుతున్నాడని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు