నువ్వే నా బలం…నువ్వే నా ధైర్యం…మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్!

Published on Jan 9, 2022 3:51 pm IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన సోదరుడు రమేష్ బాబు మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తూ, సోషల్ మీడియా వేదిక గా ఎమోషనల్ పోస్ట్ చేయడం జరిగింది. కరోనా వైరస్ పాజిటివ్ ఉండటం తో మహేష్ బాబు తన సోదరుడు రమేష్ బాబు అంత్యక్రియలకు హాజరు కాలేక పోయారు.

ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా, ” మీరు నాకు స్ఫూర్తి, నువ్వే నా బలం, నువ్వే నా ధైర్యం, నువ్వే నా సర్వస్వం, నువ్వు లేకుంటే నేను ఈరోజు సగం ఉండేవాడిని కాదు. నాకోసం చేసిన ప్రతి పనికి ధన్యవాదాలు, మీరు ఎప్పుడు అన్నయ్య గానే ఉంటారు. లవ్ యూ ఫరెవర్ అండ్ ఎవర్ అంటూ చెప్పుకొచ్చారు. మహేష్ బాబు చేసిన పోస్ట్ పై ప్రముఖులు, అభిమానులు స్పందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :