“మేజర్” చిత్రం నుండి హృదయమా సాంగ్ ను రిలీజ్ చేసిన సూపర్ స్టార్!

“మేజర్” చిత్రం నుండి హృదయమా సాంగ్ ను రిలీజ్ చేసిన సూపర్ స్టార్!

Published on Jan 7, 2022 12:28 PM IST

మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం మేజర్. అడివి శేష్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్నారు. సోని పిక్చర్స్ ఫిల్మ్స్, GMB ఎంటర్ టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు a+s మూవీస్ ల పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, వీడియో లు విడుదల అయి ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన ఒక పాటను సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా ద్వారా విడుదల చేయడం జరిగింది. హృదయమా అనే పాటను తెలుగు లో సూపర్ స్టార్ మహేష్ విడుదల చేయగా, మలయాళ భాషలో దుల్కర్ సల్మాన్ పాటను విడుదల చేశారు. సాయి మంజ్రేకర్, శోభిత ధూళిపాళ, ప్రకాష్ రాజ్, రేవతీ, మురళి శర్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రం ను త్వరలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

పాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు