లేటెస్ట్ : SSMB 28 నుండి సూపర్ స్టార్ సూపర్ పవర్ఫుల్ పిక్

Published on May 29, 2023 4:15 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రస్తుతం తెరకెక్కుతున్న SSMB 28 పై మహేష్ బాబు ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఫ్యామిలీ యాక్షన్ తో కూడిన మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో మహేష్ బాబు మాస్ పాత్ర చేస్తుండగా శ్రీలీల, పూజా హెగ్డే హీరోయిన్స్ గా నటిస్తున్నారు. హారికా హాసినీ క్రియేషన్స్ సంస్థ పై ఎస్ రాధాకృష్ణ ఎంతో భారీ వ్యయంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మూవీకి థమన్ సంగీతాన్ని పీఎస్ వినోద్ ఫోటోగ్రఫిని అందిస్తున్నారు.

ఇక ఈ మూవీ యొక్క టైటిల్ తో పాటు ఫస్ట్ స్ట్రైక్ గ్లింప్స్ ని మే 31న సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతి సందర్భముగా విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. వాటిని థియేటర్స్ లో ఫ్యాన్స్ విడుదల చేస్తారని కూడా వారు తెలిపారు. అయితే విషయం ఏమిటంటే, ఈ మూవీ నుండి తాజాగా సూపర్ స్టార్ మహేష్ పవర్ఫుల్ మాస్ పోస్టర్ ని రిలీజ్ చేసారు మేకర్స్. తలకు స్కార్ప్ కట్టుకుని భూదేవిని మహేష్ బాబు ముద్దాడుతున్న ఈ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. కాగా ఈ మూవీ యొక్క మాస్ స్ట్రైక్ మరొక రెండు రోజుల్లో విడుదల కానుందని పోస్టర్ లో మేకర్స్ ప్రకటించారు. కాగా SSMB 28 మూవీ 2024 జనవరి 13న గ్రాండ్ గా అత్యధిక థియేటర్స్ లో ప్రేక్షకాభిమానుల ముందుకి రానుంది.

సంబంధిత సమాచారం :