“సర్కారు వారి పాట” టీమ్ కి, ఫ్యాన్స్ కి మహేష్ స్పెషల్ థాంక్స్!

Published on May 18, 2022 12:30 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ సర్కారు వారి పాట. ఈ చిత్రం థియేటర్ల లో ప్రపంచ వ్యాప్తంగా భారీగా థియేటర్ల లో విడుదల అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయం సాధించడం పట్ల హీరో మహేష్ బాబు సంతోషం వ్యక్తం చేస్తూ, ట్విట్టర్ ద్వారా ఫ్యాన్స్ కి మరియు టీమ్ కి స్పెషల్ థాంక్స్ తెలిపారు.

ట్విట్టర్ వేదిక గా మహేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. సర్కారు వారి పాట పై చూపిస్తున్న ప్రేమ కి, ఫ్యాన్స్ చూపిస్తున్న ప్రేమ కి థాంక్స్, సర్కారు వారి పాట టీమ్ కి బిగ్ థాంక్స్. అంతేకాక అమేజింగ్ ఫిల్మ్ ఇచ్చిన డైరెక్టర్ పరశురామ్ కి, హీరోయిన్ కీర్తి సురేష్, నిర్మాతలకు, ఇన్ క్రెడిబుల్ మ్యూజిక్ ఇచ్చిన థమన్ కి థాంక్స్ అంటూ చెప్పుకొచ్చారు. మహేష్ బాబు సోషల్ మీడియా వేదిక గా చేసిన ట్వీట్ వైరల్ గా మారుతోంది.

సంబంధిత సమాచారం :