పెళ్లి సందD ట్రైలర్ లాంచ్ చేయడం సంతోషంగా ఉంది – సూపర్ స్టార్ మహేష్

Published on Sep 22, 2021 11:50 am IST


రోషన్, శ్రీ లీలా హీరో హీరోయిన్ లుగా గౌరీ రొనంకి దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం పెళ్లి సందD. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకులు రాఘవేంద్ర రావు బిఏ దర్శకత్వ పర్యవేక్షణ బాధ్యతలను తీసుకున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, పాటలు, వీడియో లు సినిమా పై ఆసక్తి రేకెత్తించే విధంగా ఉన్నాయి. అయితే ఈ సినిమా కి సంబందించిన ట్రైలర్ తాజాగా విడుదల అయింది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ చిత్రం ట్రైలర్ ను తాజాగా విడుదల చేసారు. ఈ మేరకు ట్రైలర్ ను విడుదల చేస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

దర్శకులు రాఘవేంద్ర రావు గారు నటుడు గా తొలి సినిమా అయిన పెళ్లి సందD చిత్రం ట్రైలర్ ను విడుదల చేయడం సంతోషంగా ఉందని అన్నారు. రాఘవేంద్ర రావు గారికి, చిత్ర యూనిట్ కి ఆల్ ది బెస్ట్ అంటూ చెప్పుకొచ్చారు మహేష్. ఆర్కే ఫిల్మ్స్ అసోసియేట్స్ ఆర్కా మీడియా వర్క్స్ తో కలిసి ఈ చిత్రాన్ని మాధవి కోవెల మూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని లు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని వీలైన త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :