బ్యూటిఫుల్ ఫ్యామిలీ పిక్ ను షేర్ చేసిన సూపర్ స్టార్ మహేష్!

బ్యూటిఫుల్ ఫ్యామిలీ పిక్ ను షేర్ చేసిన సూపర్ స్టార్ మహేష్!

Published on Jul 10, 2024 7:15 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు చివరిసారిగా, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన గుంటూరు కారం చిత్రంలో కనిపించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా థియేటర్ల లో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను, అభిమానులని విశేషంగా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టడం జరిగింది. అయితే మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా ఒక ఫోటోను షేర్ చేశారు.

భార్య నమ్రత శిరోద్కర్ మరియు గౌతమ్, సితార లతో ఉన్న ఫోటో అది. సూపర్ స్టార్ మహేష్ లుక్ ఈ ఫోటో లో ఆడియెన్స్ ను విశేషం గా ఆకట్టుకుంటుంది. తదుపరి దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో చేయబోయే చిత్రానికి ఇది లుక్ అని తెలుస్తోంది. ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉంది. త్వరలో ప్రారంభం కానున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం కి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు