సర్కారు వారి పాట: సెన్సార్ పూర్తి…రన్ టైమ్ ఎంతంటే?

Published on May 6, 2022 8:00 pm IST


సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం సర్కారు వారి పాట. ఈ చిత్రం మే 12, 2022 న ప్రపంచ వ్యాప్తంగా భారీగా థియేటర్ల లో విడుదల కాబోతుంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, నదియా, సుబ్బరాజు, సముద్ర ఖని, అజయ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఈ చిత్రం కి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను చిత్ర యూనిట్ పూర్తి చేసుకుంది. U/A సర్టిఫికెట్ పొందిన ఈ చిత్రం 2 గంటల 42 నిమిషాల నిడివి ఉన్నట్లు తెలుస్తోంది. సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :