చరణ్ సినిమాలో మోహన్ లాల్ పాత్ర అదే ?

చరణ్ సినిమాలో మోహన్ లాల్ పాత్ర అదే ?

Published on Dec 19, 2022 10:00 AM IST

క్రేజీ డైరెక్టర్ శంకర్ – మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్ తేజ్’ కాంబినేషన్ లో రాబోతున్న పాన్ ఇండియా సినిమాలో మరో హీరో కనిపించబోతున్నాడని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమా సెకండ్ హాఫ్ లో వచ్చే ఓ స్పెషల్ ఎపిసోడ్ లో ఓ ముఖ్యమంత్రి పాత్ర ఉందట. ఈ పాత్రలోనే హీరో మోహన్ లాల్ నటించబోతున్నాడు. ఈ పాత్ర ఈ సినిమా మొత్తంలోనే చాలా కీలకం అని, అందుకే.. శంకర్ ఈ పాత్ర కోసం మోహన్ లాల్ ను ఎంపిక చేసుకున్నాడని టాక్ నడుస్తోంది.

ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ తన కెరీర్ లోనే బెస్ట్ లుక్‌లో కనిపించబోతున్నాడు. వెరీ స్టైలిష్ లుక్ లో విభిన్న శైలితో చరణ్, ఈ సినిమాలోనే ప్రధాన హైలైట్‌ గా నిలుస్తాడట. పైగా ఈ సినిమాలో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. వీటిలో ఒక పాత్రలో గ్రామీణ యువకుడిగా, మరో పాత్రలో సూపర్ స్టైలిష్ గా కనిపిస్తాడట. చరణ్ లుక్ కోసం బాలీవుడ్ ప్రముఖ హెయిర్‌ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ పనిచేస్తున్నాడు. మొత్తానికి భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ భారీ సినిమాలో బరువైన ఎమోషన్స్ తో పాటు గ్రాండ్ విజువల్స్ కూడా ఉండబోతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు