దుమ్ములేపిన రజినీకాంత్ “అన్నాత్తే” టీజర్!

Published on Oct 14, 2021 6:15 pm IST


రజినీకాంత్ హీరోగా శివ దర్శకత్వంలో యాక్షన్ డ్రామా గా తెరకెక్కుతున్న తాజా చిత్రం అన్నాత్తే. ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. రజినీకాంత్ ను మాస్ అండ్ పవర్ ఫుల్ గా ఈ చిత్రం లో చూపించనున్నారు. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, పాటలు ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే తాజాగా ఈ చిత్రం నుండి టీజర్ విడుదల అయింది.

రజినీకాంత్ ఈ చిత్రం లో మాస్ లుక్ తో అద్దిరిపోయారు. టీజర్ లో రజినీ కాంత్ ను ఎలివేట్ చేసిన విధానం, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందుకు తోడుగా ఈ సినిమాలో మరింత స్టైలిష్ గా కనిపిస్తున్నారు. సన్ పిక్చర్స్ పతాకం పై ఈ చిత్రాన్ని కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. డి. ఇమ్మన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం లో మీనా, ఖుష్బూ, నయనతార, కీర్తీ సురేష్ లు లేడీ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. జగపతి బాబు, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. టీజర్ విడుదల తో అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. టీజర్ దుమ్ము దులిపేసినట్లు ఉంది అంటూ చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం :