సూపర్ స్టార్ రజినీకాంత్ – లోకేష్ ల “కూలీ” చిత్రం షూటింగ్ ప్రారంభం!

సూపర్ స్టార్ రజినీకాంత్ – లోకేష్ ల “కూలీ” చిత్రం షూటింగ్ ప్రారంభం!

Published on Jul 6, 2024 3:00 AM IST

సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో, స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ కూలీ. ఈ చిత్రంకి సంబందించిన టైటిల్ గ్లింప్స్ కి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ చిత్రంకు సంబందించిన షూటింగ్ పై మేకర్స్ క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఒక అద్భుతమైన పోస్టర్‌తో కూలీ రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

ఇటీవల విడుదలైన రజనీకాంత్ టెస్ట్ లుక్ ఆడియెన్స్ ను, ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది. ఈ సినిమాపై అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి లోకేశ్ కనగరాజ్ ఈ చిత్రాన్ని ఎలా ప్రెజెంట్ చేస్తారో చూడాలి. బంగారం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రజనీకాంత్ గ్రే షేడ్ ఉన్న పాత్రలో నటిస్తున్నారు. సన్ పిక్చర్స్‌పై కళానిధి మారన్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, అనిరుధ్ రవిచందర్ స్వరాలు సమకూరుస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు