సూపర్ స్టార్ రాజకీయ ఎంట్రి పై స్పష్టత వచ్చేది ఆరోజే !

తమిళ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ చాలా కాలంగా రాజకీయాల్లోకి రావాలి అంటూ తన అభిమానులు కోరుతున్నారు. గత కొన్ని ఏళ్ల నుండి రజిని రాజకీయ రంగ ప్రవేశం పై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. తమిళనాడులో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సూపర్ స్టార్ పాలిటిక్స్ లోకి రావాలని ఎంతోమంది ఎదురుచూస్తున్నారు. తాజాగా ఆయన తన అభిమానులతో మాట్లాడారు.

ఈ సందర్భంగా రజినికాంత్ మాట్లాడుతూ తన రాజకీయ ప్రవేశం గురించి డిసెంబర్ 31న వెల్లడిస్తానని ప్రకటించారు. దీంతో తన అభిమానుల్లో ఆనందం వెల్లువిరిసింది. రాజకీయాల్లోకి వచ్చి తను ఏం చేయాలనుకుంటున్నాడు, ఏం సాధించాలనుకుంటున్నాడు అనే విషయాలపై ఆరోజు స్పష్టత వచ్చే అవకాశం ఉంది.