సూపర్ స్టైలిష్ గా రజినీకాంత్ “జైలర్” టీజర్!

సూపర్ స్టైలిష్ గా రజినీకాంత్ “జైలర్” టీజర్!

Published on Dec 12, 2022 6:21 PM IST

కోలీవుడ్ స్టార్ హీరో, సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ జైలర్. నెల్సన్ దిలీప్ కుమార్ రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవి చందర్ సంగీతం అందిస్తున్నారు. నేడు సూపర్ స్టార్ రజినీకాంత్ పుట్టిన రోజు కావడం తో ఈ సినిమా కి సంబందించిన టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. ముతువెల్ పాండియన్ పాత్రలో సూపర్ స్టార్ ఎంట్రీ ను వీడియో లో చూపించడం జరిగింది.

ఈ వీడియో కి అనిరుద్ రవి చందర్ అద్దిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించారు. సూపర్ స్టైలిష్ గా రజినీకాంత్ కనిపించారు. ఈ టీజర్ రిలీజైన కొద్ది సేపటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు