సెన్సేషన్ క్రియేట్ చేసిన “కళావతి” సాంగ్!

సెన్సేషన్ క్రియేట్ చేసిన “కళావతి” సాంగ్!

Published on Dec 26, 2022 6:52 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ పరశురాం దర్శకత్వం లో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సర్కారు వారి పాట. ఈ చిత్రం లో కీర్తి సురేష్ మహేష్ బాబు సరసన హీరోయిన్ గా నటించింది. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. లేటెస్ట్ న్యూస్ ఎంతంటే, ఈ ఏడాది అత్యంత పాపులర్ అయిన సాంగ్ ఏదైనా ఉంది అంటే అది కళావతి సాంగ్.

ఈ ఏడాది భారీ వ్యూస్ తో పాటు భారీ లైక్స్ ను అందుకున్న సాంగ్ గా కళావతి నిలిచింది. మొత్తం గా 237 మిలియన్ వ్యూస్ ను సాధించగా, 2.5 మిలియన్స్ కి పైగా లైక్స్ ను సొంతం చేసుకొని సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. అంతేకాక ఈ పాటకి భారీగా రీల్స్ చేశారు ఆడియెన్స్. కవర్ సాంగ్స్ సైతం ఈ పాటకు భారీగా వచ్చాయి. సర్కారు వారి పాట బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు