‘కమల్ హాసన్’ కి ఫోన్ చేసిన ‘రజనీకాంత్’

kamal-haasan-rajinikanth
తమిళ చిత్ర పరిశ్రమలో పెద్ద హీరోలైన ‘రజనీకాంత్, కమల్ హాసన్’ లు కొన్ని దశాబ్దాలుగా మంచి స్నేహితులు. ఇద్దరూ కలిసి పలు చిత్రాల్లో నటించారు కూడా. ఇటీవల కమల్ చెన్నైలో ఉన్న తన ఆఫీసు మెట్ల మీద జారిపడటంతో ఆయన కాలికి గాయమై హాస్పిటల్లో చేరారు. వైద్యులు ఆయన కాలికి రెండు సర్జరీలు చేయాలని చెప్పి ఇప్పటికే ఒకటి పూర్తి చేశారు.

దీంతో రజనీకాంత్ కబాలి బిజీ నుండి కాస్త విరామం దొరికేసరికి కమల్ ను కలవాలని ప్రయత్నించారు. కానీ ఆయనకు రెండవ సర్జరీ జరుగుతున్నా నైపథ్యంలో ఆయను కలవడానికి వైద్యులు అనుమతి ఇవ్వలేదు. దీంతో రజనీ కమల్ కు ఫోన్ చేసి ఆయన మోగక్షేమాలు కనుక్కుని చాలా సేపు ఆయనతో ముచ్చటించారు.