మహేష్‌కు మరో అదిరిపోయే ఇంట్రో సాంగ్!
Published on Feb 8, 2017 12:24 pm IST


సూపర్ స్టార్ మహేష్ హీరోగా నటిస్తోన్న కొత్త సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న విషయం తెలిసిందే. సౌతిండియన్ టాప్ డైరెక్టర్స్‌లో ఒకరైన ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా ఇప్పటికే 80%పైనే షూటింగ్ పూర్తి చేసుకొని త్వరలోనే ముంబైలో ఓ షెడ్యూల్ జరుపుకోనుంది. ఇక ముంబైతో పాటు నార్త్ ఇండియాలోని కొన్ని ఇతర నగరాల్లోనూ షూట్ జరుపుకోనున్న ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తి రేకెత్తిస్తోంది.

మహేష్ నటించిన సూపర్ హిట్ సినిమాలైన అతడు, దూకుడు సినిమాలకు టైటిల్ సాంగ్స్ రాసిన విశ్వ, ఇప్పుడు ‘మహేష్ 23’కి కూడా అదిరిపోయే ఇంట్రో సాంగ్ రాశారట. అతడు, దూకుడు టైటిల్ సాంగ్స్‌లానే ఇదీ తనకు మంచి పేరు తెచ్చిపెడుతుందని విశ్వ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ఎన్.వి.ప్రసాద్, ఠాగూర్ మధు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోన్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. జూన్ 23న సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

 
Like us on Facebook