“RRR” స్పెషల్ టెలికాస్ట్ కి అదిరే రేటింగ్.!

“RRR” స్పెషల్ టెలికాస్ట్ కి అదిరే రేటింగ్.!

Published on Mar 23, 2023 9:00 PM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన లేటెస్ట్ గ్లోబల్ సెన్సేషన్ సినిమా “రౌద్రం రణం రుధిరం” కోసం తెలిసిందే. మరి గత కొన్ని వారాల కితమే ఈ సినిమా లో నాటు నాటు సాంగ్ ప్రఖ్యాత ఆస్కార్ అవార్డు కూడా గెలుపొందింది. దీనితో ఈ సినిమా పేరు ప్రపంచ వ్యాప్తంగా మరోసారి మారు మోగిపోగా ఆరోజుకి ముందు అయితే ఈ సినిమాని స్టార్ మా వారు మంచి ప్లానింగ్ తో అయితే స్పెషల్ టెలికాస్ట్ చేసారు.

ఒక్కటంటే ఒక్క బ్రేక్ కూడా లేకుండా ప్లాన్ చేసిన ఈ సినిమాకి గాను సాలిడ్ రేటింగ్ అయితే నమోదు అయ్యినట్టుగా ఇప్పుడు తెలుస్తుంది. ఈ సినిమా స్పెషల్ టెలికాస్ట్ కి ఏకంగా 8.17 టీఆర్పీ రేటింగ్ పాయింట్స్ నమోదు అయ్యాయట. దీనితో ఈ సినిమా ఆశ్చర్యకర రేటింగ్ ని రాబట్టింది అని చెప్పాలి. అలాగే స్టార్ మా వారి ఇంట్రెస్టింగ్ ప్లానింగ్ కూడా బాగానే ప్లస్ అయ్యిందని చెప్పొచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు