“వినరో భాగ్యము” ట్రైలర్ కి సూపర్బ్ రెస్పాన్స్.!

Published on Feb 8, 2023 12:59 pm IST

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా యంగ్ హీరోయిన్ కశ్మీర హీరోయిన్ గా దర్శకుడు మురళి కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “వినరో భాగ్యము విష్ణు కథ”. మరి ఈ సినిమా నుంచి మేకర్స్ అయితే నిన్న థియేట్రికల్ ట్రైలర్ ని రిలీజ్ చేయగా దీనికి సాలిడ్ ఫీడ్ బ్యాక్ ఆడియెన్స్ ని నుంచి మొదలైంది. అంతే కాకుండా సినిమా కాన్సెప్ట్ కోసం కూడా చాలా మంది మాట్లాడుకుంటున్నారు.

సినిమా ట్రైలర్ కి ఇప్పుడు మంచి రెస్పాన్స్ నమోదు అవుతుంది. మరి లేటెస్ట్ గా ఈ ట్రైలర్ అయితే రియల్ టైం లో 40 లక్షల కి పైగా వ్యూస్ వచ్చినట్టుగా మేకర్స్ తెలిపారు. ఈ ట్రైలర్ తో అయితే సినిమాపై మరిన్ని అంచనాలు స్టార్ట్ అయ్యాయి. ఇక ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాస్ నిర్మాణం వహించారు. అలాగే ఈ ఫిబ్రవరి 17న అయితే గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :