సామ్ “యశోద” కి యూఎస్ లో సూపర్బ్ స్టార్ట్.!

సామ్ “యశోద” కి యూఎస్ లో సూపర్బ్ స్టార్ట్.!

Published on Nov 11, 2022 10:00 AM IST

సౌత్ ఇండియా సూపర్ స్టార్ హీరోయిన్ సమంతా మెయిన్ లీడ్ లో నటించిన లేటెస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం “యశోద” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రాన్ని మంచి ప్రమోషన్స్ నడుమ సినిమాని రిలీజ్ చెయ్యగా ఈ చిత్రానికి హరి – హరీష్ లు దర్శకత్వం వహించగా ఓవర్సీస్ లో ఈ చిత్రంపై రీసెంట్ టైమ్స్ లో ఏ సినిమాకి కూడా దక్కని సాలిడ్ వెల్కమ్ దక్కినట్టుగా సినీ వర్గాల్లో టాక్ బయటకి వచ్చింది.

మరి అది నిజం చేస్తూ యశోద యూఎస్ లో ప్రీమియర్స్ తోనే ఈ చిత్రం 60 వేల డాలర్స్ కి పైగా నమోదు చేసిందట. దీనితో ఈ ఏడాది రీసెంట్ టైమ్స్ లో ఈ చిత్రంకి దక్కిన ఓపెనింగ్స్ హైయెస్ట్ అని తెలుస్తుంది. ఇక ఈ చిత్రానికి అయితే మణిశర్మ సంగీతం అందించగా వరలక్ష్మి శరత్ కుమార్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అలాగే ఈ చిత్రాన్ని అయితే శ్రీదేవి మూవీస్ వారు అత్యున్నత నిర్మాణ విలువలతో నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు