రాజమౌళి అవకాశమిస్తే ఆ సినిమాలో నటిస్తానంటున్న స్టార్ హీరో !

19th, December 2016 - 08:43:28 AM

Aamir_khan
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ అంటే ఒక్క బాలీవుడ్ లో మాత్రమే కాక ఇండియా మొత్తం ఎంతటి క్రేజ్ ఉందో చెప్పనక్కర్లేదు. ఆయన చేసే ప్రయోగాలు, సినిమాల కోసం కష్టపడే తీరుకి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారాయన. ప్రస్తుతం అమీర్ ఖాన్ నితీష్ తివారి డైరెక్షన్లో మల్ల యుద్ధ వీరుడు మహావీర్ సింగ్ పోగత్ జీవితం ఆధారంగా సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం డిసెంబర్ 23న హిందీతో పాటు తెలుగులో కూడా ‘యుద్ధం’ పేరుతో విడుదలకానుంది. అందుకే నిన్న హైదరాబాద్ లో జరిగిన చిత్ర ప్రమోషన్లలో ఆయనే స్వయంగా పాల్గొన్నారు.

ఈ సందర్బంగా ఆయన గత కొన్నాళ్లుగా రాజమౌళితో సినిమా గురించి వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు. రాజమౌళితో తానూ ఎలాంటి సినిమా చేయడంలేదని అంటూనే జక్కన్న డ్రీమ్ ప్రాజెక్ట్ ‘మహాభారతం’లో నటించాలని ఆశగా ఉందని, భారతంలో తనకు కర్ణుడు, కృష్ణుడు పాత్రలంటే చాలా ఇష్టమని, రాజమౌళి అవకాశమిస్తే కృష్ణుడి పాత్ర ధరిస్తానని అన్నారు. అదే విధంగా తెలుగులో చిరంజీవి, పవన్ తమిళంలో రజనీకాంత్ లతో కలిసి నటించాలని ఉందని కూడా అన్నారు.