మరోసారి తమ ఉదారతని చాటుకున్న సూపర్ స్టార్ కపుల్

Published on Mar 10, 2023 3:07 am IST


టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సినిమాల పరంగా వరుసగా సక్సెస్ లతో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. ఇక లేటెస్ట్ గా SSMB 28 మూవీ షూట్ లో పాల్గొంటున్నారు సూపర్ స్టార్. త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో పూజా హెగ్డే, శ్రీ లీల హీరోయిన్స్ గా నటిస్తున్నారు. దీని తరువాత ఎస్ ఎస్ రాజమౌళి తో మహేష్ బాబు వర్క్ చేయనున్నారు. ఇక మొదటి నుండి తండ్రి కృష్ణ గారి మాదిరిగా మంచి మనసుతో తనకు వచ్చే ఆదాయంలో కొంత మొత్తాన్ని సామజిక సేవా కార్యక్రమాలకు వినియోగిస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా మంచి పేరుతో కొనసాగుతున్నారు మహేష్.

మరోవైపు మహేష్ బాబు ఫౌండేషన్ తరపున ఇప్పటికే ఎందరో చిన్నారులకు గుండె శస్త్ర చికిత్సలు చేయించి గొప్ప మనసు చాటుకున్న సూపర్ స్టార్ కి అన్ని విధాలుగా సామజిక సేవలో చేదోడు వాదోడుగా నిలుస్తూ ఉంటారు ఆయన సతీమణి నమ్రత. ఇక తాజాగా మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని లేడీ ఏవియేషన్ స్టూడెంట్ కి ప్రత్యేకంగా లాప్ టాప్ ని అందించడంతో పాటు ఆమె విద్యా ఖర్చులని కూడా అందించేందుకు ముందుకు వచ్చారు నమ్రతా మహేష్. ఆ విధంగా సూపర్ స్టార్ దంపతులు మరొక్కసారి తమ ఉదారతని చాటుకున్నారు. కాగా ఈ విషయమై పలువురు ప్రేక్షకాభిమానులు మహేష్, నమ్రతల పై గొప్పగా ప్రసంశలు కురిపిస్తున్నారు.

సంబంధిత సమాచారం :