SSMB 29 : ఆ విషయాలన్నటి పై అందరిలో విపరీతమైన ఆసక్తి

SSMB 29 : ఆ విషయాలన్నటి పై అందరిలో విపరీతమైన ఆసక్తి

Published on Mar 10, 2023 10:49 AM IST


ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో తన కెరీర్ 28వ సినిమా చేస్తున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. పూజా హెగ్డే, శ్రీ లీల హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీని హారికా హాసిని క్రియేషన్స్ వారు ఎంతో భారీ స్థాయిలో నిర్మిస్తుండగా థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ మూవీ ఆగష్టు 11న విడుదల కానుంది. దీని అనంతరం తొలిసారిగా తన కెరీర్ లో దర్శకదిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళితో పాన్ వరల్డ్ మూవీలో నటించనున్నారు మహేష్ బాబు. శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ అత్యంత భారీ వ్యయంతో హై టెక్నీకల్ వాల్యూస్ తో నిర్మించనున్న ఈ మూవీ పై అందరిలో ఆకాశమే హద్దుగా అంచనాలు నెలకొని ఉన్నాయి.

ఇక ఈ సినిమాకి ఎన్నో ప్రచార వార్తలు పలు వార్తలు పలు మీడియా మాధ్యమాల్లో ఎప్పటి నుండో ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే. నిజానికి ఆ వార్తలకు సంబంధించి ఎక్కడా కూడా అఫీషియల్ ప్రకటనలు లేవు. అయితే ఈ భారీ పాన్ వరల్డ్ మూవీ ఎప్పుడు అనౌన్స్ చేస్తారు, షూటింగ్ ఎప్పుడు మొదలు పెడతారు, హీరోయిన్ ఎవరు, ఇతర స్టార్ క్యాస్ట్ ఏంటి, బడ్జెట్ ఎంత ఉంటుంది, ఎటువంటి జానర్ లో తీయనున్నారు వంటి విషయాల పై సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో విపరీతమైన ఆసక్తి నెలకొని ఉంది. కాగా లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం ఈమూవీ మహేష్ బాబు జన్మదినం సందర్భంగా మొదలయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మరి అదే నిజం అయితే సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి అది అతి పెద్ద పండుగే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు