పాజిటివిటీ తో కొనసాగుతున్న సూపర్ స్టార్ ‘గుంటూరు కారం’

పాజిటివిటీ తో కొనసాగుతున్న సూపర్ స్టార్ ‘గుంటూరు కారం’

Published on Jan 14, 2024 3:02 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ గుంటూరు కారం రెండు రోజుల క్రితం ఆడియన్స్ ముందుకి వచ్చి మిశ్రమ స్పందన ని అందుకుంది. త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ మూవీలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించగా హారిక హాసిని క్రియేషన్స్ సంస్థ గ్రాండ్ గా నిర్మించింది. ఎస్ థమన్ సంగీతం అందించిన గుంటూరు కారం మూవీలో రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, రఘుబాబు, మురళి శర్మ, రావు రమేష్ కీలక పాత్రలు చేసారు.

ఇక ఫస్ట్ డే ఫస్ట్ షో ఒకింత మిశ్రమ స్పందనతో కొనసాగిన ఈ మూవీకి మెల్లగా ఆడియన్స్ నుండి ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ లభిస్తోంది. రెండవ రోజు పలు ప్రాంతాల్లో ఫ్యామిలీ ఆడియన్స్ ద్వారా మూవీకి మంచి టాక్ రావడంతో రాబోయే రోజుల్లో గుంటూరు కారం మరింత మంచి కలెక్షన్ అందుకునే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ అనలిస్టులు. గుంటూరు కారం మూవీలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఎనర్జిటిక్ మాస్ పెర్ఫార్మన్స్ తో పాటు త్రివిక్రమ్ టేకింగ్ కి మంచి రెస్పాస్ లభిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు