ఓటిటి లో స్ట్రీమింగ్ కి వచ్చేసిన సూపర్ స్టార్ ‘జైలర్’

Published on Sep 7, 2023 12:38 am IST

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినికాంత్ హీరోగా యువ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ మూవీ జైలర్. తమన్నా, రమ్యకృష్ణ, యోగిబాబు, వినాయకన్, సునీల్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ మూవీలో మోహన్ లాల్, జాకీ ష్రాఫ్, శివరాజ్ కుమార్ ప్రత్యేక పాత్రల్లో కనిపించారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా కళానిధి మారన్ నిర్మించిన జైలర్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్ ని సొంతం చేసుకోవడంతో హీరో రజినీకాంత్ తో పాటు జైలర్ మూవీ టీమ్ మొత్తం కూడా ఇటీవల ఫ్యాన్స్ కి ఆడియన్స్ కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియచేసారు.

అయితే విషయం ఏమిటంటే, ఈ సినిమా థియేటర్స్ లో మిస్ అయిన వారు నేడు అర్ధరాత్రి నుండి ప్రముఖ ఓటిటి మాధ్యమం అమెజాన్ ప్రైమ్ ద్వారా దీనిని వీక్షించవచ్చు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల ఆడియన్స్ అందరికీ ఈ మూవీ ఆయా భాషల్లో అందుబాటులో ఉంది. రజినీకాంత్ పవర్ఫుల్ రోల్ లో కనిపించిన జైలర్ లో అనిరుద్ సంగీతం తోపాటు రజినికాంత్ సూపర్ యాక్టింగ్, నెల్సన్ ఆకట్టుకునే టేకింగ్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. మరి థియేటర్స్ లో అదరగొట్టిన ఈ బ్లాక్ బస్టర్ మూవీ ఎంతమేర ఓటిటి ఆడియన్స్ ని అలరిస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :