సూపర్ స్టార్ కృష్ణ గారి దశ దినకర్మ కార్యక్రమ వివరాలు

సూపర్ స్టార్ కృష్ణ గారి దశ దినకర్మ కార్యక్రమ వివరాలు

Published on Nov 19, 2022 4:00 PM IST

టాలీవుడ్ లెజెండరీ సూపర్ స్టార్ నటశేఖర కృష్ణ గారు ఈ నెల 15వ తేదీన హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయన మరణంతో ఘట్టమనేని ఫ్యామిలీ, ఫ్యాన్స్, ఆడియన్స్ తో పాటు యావత్ సినీ పరిశ్రమ మొత్తం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఇప్పటికే ఈ ఏడాది అన్నయ్య రమేష్ బాబుని, ఇటీవల తల్లి ఇందిరమ్మని కోల్పియిన మహేష్ బాబు గారు, తాజాగా తండ్రి మరణంతో మరింతగా కృంగిపోయారు. అయితే పలువురు సినీ ప్రముఖులు కృష్ణ గారి పార్థివదేహాన్ని దర్శించి ఆయనకి నివాళులు అర్పించడంతో పాటు మహేష్ బాబు గారికి వారి కుటుంబసభ్యులకి ధైర్యం చెప్పారు.

అనంతరం తండ్రి అంత్యక్రియలను మహాప్రస్థానంలో పూర్తి చేసారు మహేష్ బాబు. ఇక కృష్ణ గారి మూడవరోజు చిన్న కర్మ ని మొన్న కుటుంబసభ్యులు నిర్వహించారు. కాగా కృష్ణ గారి దశ దినకర్మ కార్యక్రమాన్ని నవంబర్ 27న ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుండి హైదరాబాద్ జుబిలీ హిల్స్ లోని జెఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించేందుకు ఘట్టమనేని కుటుంబసభ్యులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాగా ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులుతో పాటు అశేషమైన సూపర్ స్టార్ ఫ్యాన్స్ కూడా తరలి రానున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు