వైరల్ వీడియో : సూపర్ స్టార్స్ కృష్ణ గారు, మహేష్ బాబు మెమొరబుల్ మ్యాషప్

వైరల్ వీడియో : సూపర్ స్టార్స్ కృష్ణ గారు, మహేష్ బాబు మెమొరబుల్ మ్యాషప్

Published on Nov 20, 2022 12:57 AM IST


టాలీవుడ్ లెజెండరీ సూపర్ స్టార్ నటశేఖర కృష్ణ గారు ఈ నెల 15వ తేదీన తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. నటుడిగా 350 వరకు సినిమాల్లో నటించిన కృష్ణ గారు, అప్పట్లోనే ఎన్నో కొత్త రకాల సాంకేతికతలను మన టాలీవుడ్ కి పరిచయం చేసారు. రీల్ పైనే కాక రియల్ గా కూడా సూపర్ స్టార్ గా ఎంతో గొప్ప పేరు అందుకున్న కృష్ణ గారు, ఎందరో దర్శకనిర్మాతలకు వెన్నుదన్నుగా నిలిచి అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచారు. ఇక ఆయన మరణంతో ఘట్టమనేని కుటుంబం, ఆడియన్స్, ఫ్యాన్స్ మాత్రమే కాదు యావత్ చిత్ర పరిశ్రమ మొత్తం విషాదంలో మునిగిపోయింది. ఇక అనేకమంది కృష్ణ గారి అభిమానులు అయితే ఇప్పటికీ వారి మహాభినిష్క్రమణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

అయితే వారందరికీ మెమొరబుల్ గా నిలిచేలా నాటి సూపర్ స్టార్ కృష్ణ గారితో ఆయన తనయుడు నేటి సూపర్ స్టార్ మహేష్ బాబుని కలిపి వారిద్దరి పలు సినిమాల్లోని ఒకటే విధంగా ఉండే కొన్ని సన్నివేశాలు తీసుకుని వాటిని ఒక అద్భుతమైన మ్యాషప్ గా ఎడిట్ చేసి కొందరు సోషల్ మీడియాలో రిలీజ్ చేసారు. కాగా ఆ వీడియో సూపర్ ఫ్యాన్స్ ని మాత్రమే కాదుగా ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకుంటోంది. అటు కృష్ణ గారు, ఇటు మహేష్ బాబు గారు ఇద్దరూ కూడా పలు రకాల గెటప్స్ లో ముఖ్యంగా రైతు గా, కౌ బాయ్ గా, అల్లూరి సీతారామరాజుగా ఇలా వారిద్దరి పలు సినిమాల్లోని సీన్స్ తో ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతూ వైరల్ అవుతోంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ మెమొరబుల్ వీడియో పై ఒక లుక్ వేయండి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు