లేటెస్ట్ : సుదర్శన్ 35 ఎమ్ ఎమ్ లో స్పెషల్ అట్రాక్షన్ గా కృష్ణ గారి కటౌట్

Published on May 27, 2023 5:08 pm IST


మే 31న టాలీవుడ్ లెజెండరీ సూపర్ స్టార్ కృష్ణ గారి జయతి సందర్భంగా ఆయన నటించిన ఒకప్పటి సంచలన విజయం సాధించిన కౌ బాయ్ సినిమా మోసగాళ్లకు మోసగాడు మూవీని 4కె లో రీ రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ పై టాలీవుడ్ ఆడియన్స్ తో పాటు కృష్ణ గారు, మహేష్ ఫ్యాన్స్ లో మంచి క్రేజ్ ఉంది.

మరోవైపు ఇప్పటికే ఈ మూవీ టికెట్స్ బుకింగ్ ఓపెన్ చేయగా మంచి రెస్పాన్స్ లభిస్తోంది. అయితే విషయం ఏమిటంటే, మోసగాళ్లకు మోసగాడు రిలీజ్ సందర్భంగా కృష్ణ గారి కటౌట్ ని హైదరాబాద్ సుదర్శన్ 35 ఎమ్ ఎమ్ లో ఏర్పాటు చేయగా ప్రస్తుతం అది స్పెషల్ అట్రాక్షన్ గా మారి అందరినీ ఆకట్టుకుంటోంది. మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు యుఎస్ఏ లో కూడా ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు. మరి మోసగాళ్లకు మోసగాడు మూవీ రీ రిలీజ్ కి ఎంత మేర కలెక్షన్ అందుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :