లేటెస్ట్ : సూపర్ స్టార్ కృష్ణ గారి మెమోరియల్ ఏర్పాటు చేయనున్న ఫామిలీ మెంబర్స్ … డిటైయిల్స్ ఇవే

లేటెస్ట్ : సూపర్ స్టార్ కృష్ణ గారి మెమోరియల్ ఏర్పాటు చేయనున్న ఫామిలీ మెంబర్స్ … డిటైయిల్స్ ఇవే

Published on Nov 17, 2022 8:00 PM IST


టాలీవుడ్ లెజెండరీ సూపర్ స్టార్ పద్మభూషణ్ నటశేఖర కృష్ణ గారి మహాభినిష్క్రమణంతో యావత్ చిత్రసీమతో పాటు కోట్లాదిమంది ఆయన అభిమానగణం కూడా ఒక్కసారిగా తీవ్రవిషాదంలోకి వెళ్లపోయారు. వారు మన నుండి దూరమై రెండు రోజులు గడుస్తున్నప్పటికీ కూడా సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు ఘట్టమనేని కుటుంబీకులు కూడా ఇంకా బాధాతత్ప హృదయంతో ఆవేదన చెందుతున్నారు.

కాగా ఆ మహానటుడి సినీ జీవితంలోని పలు పదిలమైన జ్ఞాపకాలను ఇక పై ప్రేక్షకాభిమానుల ముందుకి తీసుకువచ్చేలా ప్రస్తుతం సూపర్ స్టార్ కృష్ణ గారి ఫ్యామిలీ ఒక బృహత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అతి త్వరలో కృష్ణ గారి మెమోరియల్ ని హైదరాబాద్ లో ఏర్పాటు చేసేందుకు వారు సంసిద్ధం అవుతున్నారు. ఆ మెమోరియల్ లో సూపర్ స్టార్ కృష్ణ గారి విగ్రహంతో పాటు వారి సినీ జీవితానికి, సినిమాలకు సంబందించిన పలు ఫోటోలు, షీల్డులని అందులో ప్రేక్షకబిమానుల యొక్క సందర్శనార్ధం ఏర్పాటు చేయనున్నారు. కాగా కొద్దిసేపటి క్రితం కృష్ణ గారి మెమోరియల్ కి సంబందించిన వార్త బయటకు రాగా దీని గురించిన పూర్తి వివరాలు అతి త్వరలో తెలియనున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు