లేటెస్ట్ వీడియో : సూపర్ స్టార్ కృష్ణ గారి 13వ రోజు సంస్మరణ కార్యక్రమ హైలైట్స్

లేటెస్ట్ వీడియో : సూపర్ స్టార్ కృష్ణ గారి 13వ రోజు సంస్మరణ కార్యక్రమ హైలైట్స్

Published on Nov 28, 2022 11:15 PM IST


టాలీవుడ్ లెజెండరీ సూపర్ స్టార్ నటశేఖర కృష్ణ గారు నవంబర్ 15 న అకాలమరణం పొందిన విషయం తెలిసిందే. ఆయన మృతితో టాలీవుడ్ చిత్రసీమతో పాటు ఎందరో ప్రేక్షకాభిమానులు, అలానే సినిమా ప్రముఖులు సైతం తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అయితే ఆయన మరణించిన 13వ రోజు సంస్మరణ కార్యక్రమాన్ని పలువురు కుటుంబసభ్యులు, సినీ ప్రముఖులు, అభిమానుల సమక్షంలో నిన్న హైదరాబాద్ లోని జెఆర్సీ కన్వేషన్ సెంటర్ లో నిర్వహించారు ఘట్టమనేని కుటుంబసభ్యులు.

ఈ సందర్భంగా తండ్రి కృష్ణని తల్చుకుని ఎమోషనల్ గా మాట్లాడిన నేటితరం సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆయన అందించిన ఎంతో గొప్ప సంపద మీ అభిమానం అని, ఆయనకు కొడుకుగా పుట్టడం అదృష్టం అంటూ మాట్లాడారు మహేష్. ఇక నేడు కొద్దిసేపటి క్రితం నిన్నటి సంస్మరణ కార్యక్రమం తాలూకు హైలైట్స్ వీడియో ని తన అధికారిక యూట్యూబ్ ఛానెల్ లో పోస్ట్ చేసారు మహేష్. ప్రస్తుతం ఆ వీడియోని పలువురు సూపర్ స్టార్ ఫ్యాన్స్ సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు