వైరల్ పిక్ : సూపర్ స్టార్ మహేష్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ

వైరల్ పిక్ : సూపర్ స్టార్ మహేష్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ

Published on Dec 27, 2022 5:43 PM IST


టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ SSMB28 తదుపరి షెడ్యూల్ జనవరి రెండవ వారం నుండి ప్రారంభం కానుంది. ప్రస్తుతం యూనిట్ ఆ షెడ్యూల్ యొక్క సెట్టింగ్స్ సన్నాహాల్లో ఉంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని హారికా హాసిని క్రియేషన్స్ పై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తుండగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు.

మరోవైపు మూడు రోజుల క్రితం తన ఫ్యామిలీ తో కలిసి స్విట్జర్ల్యాండ్ వెకేషన్ కి వెళ్లారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి అక్కడ సరదాగా గడుపుతున్న సూపర్ స్టార్, కొద్దిసేపటి క్రితం అక్కడి లూజర్న్ నగరంలోని ప్రముఖ మాండరిన్ ఓరియెంటల్ ప్యాలస్ హోటల్ లో నమ్రత, సితార, గౌతమ్ లతో కలిసి దిగిన ఒక బ్యూటిఫుల్ పిక్ ని తన ఇన్స్టాగ్రమ్ లో పోస్ట్ చేసారు. కాగా ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు