ఆ ఇద్దరు స్టార్స్ తో మహేష్ బాబు బాక్సాఫీస్ క్లాష్ తప్పదా ?

Published on Feb 18, 2023 2:16 am IST


సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ SSMB 28 ఫిబ్రవరి 23 నుండి నెక్స్ట్ షెడ్యూల్ జరుపుకోనుంది. భారీ యాక్షన్ తో కూడిన ఫామిలీ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ మూవీని త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తుండగా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితం అవుతున్న ఈ మూవీ ఆగష్టు 11న విడుదల కానున్నట్లు ఇప్పటికే నిర్మాత నాగ వంశీ పలు ఇంటర్వ్యూస్ లో తెలిపారు.

అయితే లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం సరిగ్గా అదే రోజున బాలీవుడ్ స్టార్ నటుడు రణబీర్ కపూర్ నటిస్తున్న యానిమల్ మూవీ కూడా రిలీజ్ కానుండడం, అలానే సూపర్ స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ మూవీ జైలర్ కూడా సరిగ్గా అదే రోజున రిలీజ్ అయ్యే అవకాకాశం ఉందని అంటున్నారు. ఒకవేళ అదే కనుక జరిగితే బాక్సాఫీస్ దగ్గర ఆ ఇద్దరు హీరోలతో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ కి క్లాష్ తప్పదు అనే చెప్పాలి. అటు జైలర్, ఇటు యానిమల్ రెండూ తెలుగులో కూడా రిలీజ్ కానుండడంతో ఒకింత థియేటర్స్ కొరత సమస్య కూడా తలెత్తే అవకాశం ఉందని అంటున్నారు సినీ విశ్లేషకులు. మరి రాబోయే రోజుల్లో ఈ మూడు సినిమాల రిలీజ్ విషయమై ఏమి జరుగుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :