ట్రెండింగ్ : హ్యాపీ బర్త్ డే ‘సూపర్ స్టార్ మహేష్ బాబు’

Published on Aug 9, 2022 3:00 am IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం హీరోగా ఒక్కో సినిమాతో ఒక్కో భారీ సక్సెస్ ని అందుకుంటూ కెరీర్ పరంగా దూసుకెళ్లడంతో పాటు హీరోగా కోట్లాది ప్రేక్షకాభినుల హృదయాల్లో గొప్ప పేరుని దక్కించుకున్నారు. ఇక ఇప్పటికే కెరీర్ పరంగా ఇటీవల సర్కారు వారి పాట మూవీ సూపర్ సక్సెస్ తో డబుల్ హ్యాట్రిక్ కి శ్రీకారం చుట్టిన సూపర్ స్టార్ మహేష్ బాబు, త్వరలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, దర్శకదిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి లతో తన నెక్స్ట్ మూవీస్ చేయనున్నారు.

ఇక నేడు ఆయన 47వ బర్త్ డే కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన అభిమానులు భారీ స్థాయిలో కేక్ కట్టింగ్స్ చేయడంతో పాటు పలు సేవా కార్యక్రమాలకి కూడా శ్రీకారం చుట్టారు. మరోవైపు ఈ బర్త్ కి సూపర్ స్టార్ మహేష్ 2006లో నటించిన అతి పెద్ద ఇంస్ట్రీ హిట్ మూవీ పోకిరిని ప్రస్తుతం 4కె వర్షన్ లో రీప్రింట్ చేసి రిలీజ్ చేస్తున్నారు. కాగా ప్రపంచవ్యాప్తంగా 300 వరకు షోలతో భారీ క్రేజ్ తో ఈ మూవీ ప్రస్తుతం థియేటర్స్ లో గ్రాండ్ లెవెల్లో దూసుకెళుతోంది. ఇక మహేష్ బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ అన్ని కూడా హ్యాపీ బర్త్ డే సూపర్ స్టార్ మహేష్ బాబు హ్యాష్ టాగ్ లతో ట్రేండింగ్ లో దూసుకెళ్తున్నాయి .

సంబంధిత సమాచారం :