SSMB28 లో మహేష్ బాబు రోల్ అలా ఉండనుందట …?

SSMB28 లో మహేష్ బాబు రోల్ అలా ఉండనుందట …?

Published on Oct 8, 2022 1:04 AM IST


సూపర్ స్టార్ మహేష్ బాబు తో ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ SSMB28. ఈ మూవీ పై అటు మహేష్ ఫ్యాన్స్ లో ఇటు నార్మల్ ఆడియన్స్ లో భారీ స్థాయి అంచనాలు ఉన్నాయి. ముచ్చటగా మూడోసారి మహేష్ బాబు, త్రివిక్రమ్ కలిసి వర్క్ చేస్తున్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ లో ఫస్ట్ షెడ్యూల్ జరుపుకున్న ఈ మూవీ తదుపరి షెడ్యూల్ ని ఈ నెల 10న నుండి మొదలెట్టనున్నట్లు తెలుస్తోంది.

హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎంతో గ్రాండ్ లెవెల్లో తెరకెక్కుతున్న ఈ మూవీలో సూపర్ స్టార్ మహేష్ బాబు క్యారెక్టర్ ఎంతో పవఫుల్ గా పక్కాగా మాస్ స్టైల్ లో ఉంటుందట. మహేష్ బాబు ఇంతవరకు తన కెరీర్ లో చేయని ఒక డిఫరెంట్ రోల్ ఇందులో చేస్తుండగా మూవీని అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టునేల ఎంతో అద్భుతంగా దర్శకుడు త్రివిక్రమ్ తెరెక్కిస్తున్నట్లు చెప్తోంది యూనిట్. కాగా ఈ మూవీని వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఏప్రిల్ 28న వరల్డ్ వైడ్ అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు