సూపర్ థాట్ : మహేష్ ఫ్యాన్స్ మనసైన ఆలోచన ….!!

Published on Aug 3, 2022 5:02 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట భారీ సక్సెస్ తో ప్రస్తుతం మంచి జోరు మీదున్నారు. త్వరలో త్రివిక్రమ్ తో చేయనున్న మూవీ కోసం ఆయన సిద్ధం అవుతున్నారు. హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందనున్న ఈ మూవీ త్వరలో పట్టాలెక్కనుంది. కాగా ఈ నెల 9 న మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఆయన నటించిన అతి పెద్ద ఇండస్ట్రీ హిట్ మూవీ పోకిరిని 4కె వర్షన్ లో రీ రిలీజ్ చేస్తున్నారు.

ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలు సహా ఓవర్సీస్ లోని పలు ప్రాంతాల్లో ఈ మూవీ స్పెషల్ షోస్ ఎరెంజ్ చేయగా ఇప్పటికే హాట్ కేకుల్లా టికెట్స్ అమ్ముడవుతున్నాయి. అయితే విషయం ఏమిటంటే, ఈ స్పెషల్ షోస్ కి వచ్చే ఆదాయం మొత్తాన్ని కూడా చిన్నారుల హార్ట్ ఆపరేషన్స్, అలానే చదువుల కోసం మహేష్ బాబు ఫౌండేషన్ వారికి విరాళంగా అందించడానికి సిద్ధం అయ్యారు సూపర్ ఫ్యాన్స్, డిస్ట్రిబ్యూటర్స్. కాగా ఈ విషయమై వారు తీసుకున్న ఈ గొప్ప మనసైన ఆలోచనకు పలువురు ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు కురుస్తున్నాయి.

సంబంధిత సమాచారం :