సూపర్ క్లిక్ : సూపర్ స్టార్ బ్యాక్ ఇన్ యాక్షన్ మోడ్

సూపర్ క్లిక్ : సూపర్ స్టార్ బ్యాక్ ఇన్ యాక్షన్ మోడ్

Published on Dec 3, 2022 9:40 PM IST


టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో SSMB28 మూవీ చేస్తోన్న విషయం తెలిసిందే. హారికా హాసిని క్రియేషన్స్ వారు నిర్మిస్తున్న ఈ మూవీ ఇటీవల ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకోగా త్వరలో సెకండ్ షెడ్యూల్ కి రెడీ అవుతోంది. ఇటీవల సూపర్ స్టార్ కృష్ణ గారి మరణంతో కొన్నాళ్లపాటు సెకండ్ షెడ్యూల్ వాయిదా పడిన విషయం తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నారు.

అయితే విషయం ఏమిటంటే, తండ్రి కృష్ణ గారి మరణాంతరం కొన్నాళ్లుగా బాధలో మునిగిపోయిన సూపర్ స్టార్ మహేష్ బాబు, ఫైనల్ గా యాక్షన్ మోడ్ లోకి దిగారు. తాజాగా ప్రముఖ శీతల పానీయాల సంస్థ మౌంటెన్ డ్యూ వారి లేటెస్ట్ యాడ్ లో ఆయన నటిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఆ యాడ్ షూట్ సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసిన సూపర్ పిక్ ప్రస్తుతం ట్రెండింగ్ లో దూసుకెళుతోంది. మొత్తంగా తమ అభిమాన సూపర్ స్టార్ మళ్ళి త్వరలో షూటింగ్ లో జాయిన్ అయ్యేందుకు సిద్ధం అవుతుండడంతో సూపర్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు