శభాష్ మహేష్ : మరొక చిన్నారికి ప్రాణదానం చేసిన సూపర్ స్టార్

శభాష్ మహేష్ : మరొక చిన్నారికి ప్రాణదానం చేసిన సూపర్ స్టార్

Published on Dec 6, 2022 10:55 PM IST


టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, తన తండ్రి లెజెండరీ సూపర్ స్టార్ కృష్ణ నటశేఖర కృష్ణ గారి మాదిరిగా అటు రీల్ పైనే కాదు ఇటు రియల్ లైఫ్ లో కూడా నిజమైన మనసున్న సూపర్ స్టార్ గా తన గొప్ప మనసు చాటుకుంటూ కొనసాగుతున్నారు. తనకు వచ్చే ఆదాయంలో 30 శాతం సామజిక సేవా కార్యక్రమాలను వినియోగిస్తున్న సూపర్ స్టార్, తాము నెలకొల్పిన మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా ఆంధ్ర హాస్పిటల్ వారి సౌజన్యంతో ఇప్పటికే ఎందరో చిన్నారులకు గుండె శస్త్ర చికిత్సలు చేయించడం జరిగింది.

అందులో భాగంగా ఇటీవల రెండు సంవత్సరాల వయసు గల మోహిత్ సాయి అనే చిన్నారికి గుండె సంబంధిత అనారోగ్యం కారణంగా శస్త్ర చికిత్స చేయించారు. ప్రస్తుతం మోహిత్ సాయి చక్కగా కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు కొద్దిసేపటి క్రితం మహేష్ బాబు ఫౌండేషన్ వారు తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా పోస్ట్ చేస్తూ తెలిపారు. ఓప్రక్క తన తండ్రి కృష్ణ గారి మరణంతో కృంగిపోయినప్పటికీ కూడా తన సేవని మాత్రం ఆపని మనసున్న సూపర్ స్టార్ మహేష్ బాబు పై పలువురు ప్రసంశలు కురిపిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు