గుంటూరు కారం : షూట్ పై పక్కా ప్లానింగ్ తో సూపర్ స్టార్ మహేష్

Published on Jun 4, 2023 2:01 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ గుంటూరు కారం. త్రివిక్రమ్ తీస్తున్న ఈ మూవీపై సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. శ్రీలీల, పూజా హెగ్డే హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీ నుండి ఇటీవల రిలీజ్ అయిన మాస్ స్ట్రైక్ గ్లింప్స్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై ఇప్పటివరకు ఉన్న అంచనాలు అమాంతం పెంచేసాయి.

హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న గుంటూరు కారం నెక్స్ట్ షెడ్యూల్ జూన్ 10 నుండి ప్రారంభం కానుండగా ఈ భారీ షెడ్యూల్ ని తమ టీమ్ తో కలిసి పక్కాగా ప్లాన్ చేశారట మహేష్ బాబు. ఎట్టి పరిస్థితుల్లో మూవీ షూట్ అక్టోబర్ చివరి కల్లా పూర్తి కావాలని టీమ్ ని మహేష్ బాబు కోరారట. ఆ విధంగా ఇతర ఆర్టిస్టుల డేట్స్ కూడా మిస్ కాకుండా షూట్ మొత్తం ప్రణాళికా బద్దంగా జరుగనుందట. దీని అనంతరం రాజమౌళి తో SSMB 29 మూవీ చేయనున్నారు మహేష్. కాగా ఆ మూవీ యొక్క షూట్ వర్క్ షాప్ నవంబర్ నుండి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. గుంటూరు కారం మూవీ సంక్రాంతి కానుకగా 2024 జనవరి 13న గ్రాండ్ లెవెల్లో విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :