వావ్ : నాగ్ ‘ది ఘోస్ట్’ ట్రైలర్ లాంఛ్ చేయనున్న సూపర్ స్టార్ …!

వావ్ : నాగ్ ‘ది ఘోస్ట్’ ట్రైలర్ లాంఛ్ చేయనున్న సూపర్ స్టార్ …!

Published on Aug 23, 2022 6:00 PM IST

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున లేటెస్ట్ మూవీ ది ఘోస్ట్. ఇటీవల యాంగ్రీ స్టార్ రాజశేఖర్ తో తెరకెక్కించిన గరుడావెగా మూవీతో మంచి సక్సెస్ ని పేరుని అందుకున్న ప్రవీణ్ సత్తారు, ది ఘోస్ట్ ని కూడా మంచి యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్, టీజర్ మూవీపై అందరిలో బాగా అంచనాలు ఏర్పరచగా ఆగష్టు 25న ఈ మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేయనుంది యూనిట్.

కాగా ఈ ట్రైలర్ ని సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేయనున్నట్లు ది ఘోస్ట్ యూనిట్ కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి సంస్థలపై ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో సోనాల్ చౌహన్ హీరోయిన్ గా నటించగా ఇతర పాత్రల్లో గుల్ పనాగ్, రవి వర్మ, మనీష్ చౌదరి, శ్రీకాంత్ అయ్యంగార్, అనేక సురేంద్రన్ తదితరులు నటిస్తున్నారు. కాగా ఈ మూవీని అక్టోబర్ 5న దసరా పండుగ కానుకగా భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు