సూపర్ స్టార్ మహేష్ బాబు లండన్ ప్రయాణం తేదీ ఫిక్స్ అయిందా ?

సూపర్ స్టార్ మహేష్ బాబు లండన్ ప్రయాణం తేదీ ఫిక్స్ అయిందా ?

Published on Dec 10, 2022 1:00 AM IST


టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన సర్కారు వారి పాట మూవీ ద్వారా ప్రేక్షకాభిమానుల ముందుకి వచ్చి పెద్ద సక్సెస్ అందుకున్నారు. ఇక ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఆయన చేస్తున్న SSMB28 మూవీ పై సూపర్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ మూవీలో సూపర్ స్టార్ సూపర్ మాస్ లుక్ లో కనపడనున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ గ్రాండ్ గా జరుపుకున్న ఈ మూవీ త్వరలో సెకండ్ షెడ్యూల్ జరుపుకోనుంది. అయితే లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం ఈ నెల 22న సూపర్ స్టార్ మహేష్ బాబు లండన్ ప్రయాణమై వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల తన తండ్రి లెజెండరీ సూపర్ స్టార్ నటశేఖర కృష్ణ గారి హఠాన్మరణంతో ఎంతో కృంగిపోయారు మహేష్. అయితే లండన్ ట్రిప్ అనంతరం ఆయన SSMB28 మూవీ సెకండ్ షెడ్యూల్ లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ మూవీని హారికా హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తుండగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు