మేనల్లుడి పై సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశంసలు

Published on Sep 16, 2023 6:30 pm IST

టాలీవుడ్ యువ నటుడు అశోక్ గల్లా ఇటీవల శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందిన హీరో మూవీ ద్వారా టాలీవుడ్ కి నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది .ఇక ఈమూవీలో హీరోగా తన నటనతో ఆకట్టుకున్న అశోక్ కి తాజాగా బెస్ట్ డెబ్యూ యాక్టర్ గా సైమా వారి అవార్డు లభించింది. నిన్నటి సైమా 2023 దుబాయ్ ఈవెంట్ లో అశోక్ గల్లా ఈ అవార్డుని సొంతం చేసుకున్నారు.

అయితే తన మేనల్లుడికి అవార్డు దక్కడంతో కొద్దిసేపటి క్రితం సూపర్ స్టార్ మహేష్ బాబు తన సోషల్ మీడియా ప్రొఫైల్స్ ద్వారా అతడి పై ప్రసంశలు కురిపించారు. నువ్వు అవార్డు అందుకోవడం ఎంతో ఆనందంగా ఉంది, రాబోయే రోజుల్లో కెరీర్ పరంగా నువ్వు మరింతగా ఎదగాలని కోరుకుంటున్నాను అంటూ సూపర్ స్టార్ మహేష్ బాబు పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ప్రస్తుతం అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో తన నెక్స్ట్ మూవీ చేస్తున్నారు అశోక్.

సంబంధిత సమాచారం :